Palnadu News : నరసరావుపేట: పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్ల బాండ్ల నుంచి నగదు తీసుకుని బ్యాంకు మేనే జర్ రూ. కోట్లలో మోసం చేసిన సంగతి విధితమే. అక్కడ బ్రాంచ్ మేనేజర్గా పనిచేసిన నరేష్ నరసరావుపేటలో విధులు నిర్వహించిన సమయంలో ఖాతాదారుల నుంచి ఫిక్స్ డ్ డిపాజిట్లు సేకరించి వారిని కూడా మోసం చేసినట్లు అధికారులు గుర్తించారు. ముంబయి నుంచి వచ్చిన జోనల్ మేనేజర్ సందీప్ మెహ్రా సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నరసరావుపేటలోని ఐసీఐసీఐ బ్యాంకులో పలువురు ఖాతాదా రులను పిలిపించి మాట్లాడారు. ఇక్కడ కూడా నరేష్ కొందరిని మోసం చేసినట్లు గుర్తించారు. ఖాతాదారులతో మాట్లాడి ఫిక్స్ డ్ డిపాజిట్లు చేయించి, ఓడీ ఖాతా తెరిపించి, నిధులు సొంతానికి వాడుకుని నెలనెలా వ్యక్తిగతంగా వడ్డీ చెల్లించాడు. ఖాతాదారులు సెల్ఫోన్ నుంచే ఓటీపీ చెప్పించుకుని ఈ మోసానికి పాల్పడి నట్లు అధికారులు గుర్తించారు. సోమ
వారం వరకూ ఎనిమిది మంది ఖాతాదా రులతో ఉన్నతాధికారులు మాట్లాడారు. సుమారు రూ.కోటి వరకూ ఇలా నగదు గల్లంతైనట్లు తెలుస్తోంది.

 

One Response

Need Premium Listing?